టీచర్లు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనొద్దా?

by Disha Web Desk 4 |
టీచర్లు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనొద్దా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దసరా సెలవుల్లో సీడబ్ల్యూఎస్ఎన్ శిక్షణ కార్యక్రమం పేరుతో టీచర్లను బతుకమ్మ పండుగలో పాల్గొనకుండా చేయడంపై Telangana Teachers Union (TTU) is very angry వ్యక్తంచేసింది. ఈ సెలవుల్లో సీడబ్ల్యూఎస్ఎన్ శిక్షణ కార్యక్రమం చేపట్టడం ఏమాత్రం సరికాదని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు ఆదివారం విజ్ఞప్తి చేశారు. శిక్షణను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మునగాల మణిపాల్ రెడ్డి, ఏరుకొండ నరసింహస్వామి మాట్లాడుతూ.. దసరా పండుగా సమయంలో ఐదు రోజులపాటు చిల్డ్రెన్ విత్ స్పెషల్ నీడ్స్ అన్‌‌లైన్ శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్‌ను దసరా సెలవుల్లో నిర్వహించడాన్ని వ్యతిరేకించారు.

అత్యంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ పండుగలో మహిళా ఉపాధ్యాయినీలు పాల్గొనకుండా చేయడం మంచి పద్ధతి కాదని, ఇది తెలంగాణ పండుగలను అవమానించడంగా టీటీయూ భావిస్తున్నదని స్పష్టం చేశారు. అందుకే ఇప్పటికైనా దీన్ని వాయిదా వేసి దసరా సెలవుల అనంతరం నిర్వహించడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ మాటిమాటికి ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యతిరేకించారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


Next Story