కాంగ్రెస్ తెలంగాణ ‘స్పెషల్ మేనిఫెస్టో’ రిలీజ్.. రాష్ట్రానికి 23 కీలక హామీలివే..!

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ తెలంగాణ ‘స్పెషల్ మేనిఫెస్టో’ రిలీజ్.. రాష్ట్రానికి 23 కీలక హామీలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను శుక్రవారం గాంధీ భవన్‌లో రిలీజ్ చేసింది. అపరిష్కృతంగా ఉన్న పలు కీలక అంశాలతో పాటు కొత్త హామీలను ‘స్పెషల్ మేనిఫెస్టో’ హస్తం పార్టీ ప్రస్తావించింది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ హామీలు తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

పొందుపర్చిన 23 హామీలివే..!

1. హైదరాబాద్ మహానగరానికి ఐటీఐఆర్ ప్రాజెక్ట్

2. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యాయంలో ఉక్కుకర్మాగారం, హైదరాబాద్‌లో ఐఐఎమ్, హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే పక్క నుంచి రాపిడ్ రైల్వే వ్యవస్థ, మైనింగ్ యూనివర్సిటీ

3. భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఆంధ్రాలో విలీన అయిన ఐదు గ్రామాలు అయినా ఏకపాక, గుండాల, పురుషోత్తం పట్నం, కన్నెగూడెం, పిచుకల పాడులను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం

4.పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా

5. నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు

6. నూతన ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటు

7. రామగుండం-మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు

8. నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు

9. కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు

10. నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపు

11. జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు

12. ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు

13. ఐఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్) ఏర్పాటు

14. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) క్యాంపస్ ఏర్పాటు

15. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు

16. ఐసీఎంఆర్ పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు

17. 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచ్‌లకు నేరుగా బదిలీ.

18. ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు

19. ఇండస్ట్రీయల్ కారిడార్ల ఏర్పాటు

20. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడి సాంస్కృతిక, వినోద కేంద్రం ఏర్పాటు

21. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా

22. డ్రైపోర్ట్ ఏర్పాటు

23. హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు హామీలను కాంగ్రెస్ తెలంగాణ స్పెషల్ మేనిఫెస్టోలో పొందుపరిచింది.

Next Story

Most Viewed