- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులారా అప్రమత్తంగా ఉండండి: తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి
by Ajay Maddhiboyina |
ఆర్టీసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్ల చేతిలో చిక్కి నట్టేట మునగొద్దని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి నిరుద్యోగులకు సూచించారు. టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ నియమకాలన్నీ పూర్తి పారదర్శకంగా, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతాయని స్పష్టం చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్ల చేతిలో చిక్కి నట్టేట మునగొద్దని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి నిరుద్యోగులకు సూచించారు. టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ నియమకాలన్నీ పూర్తి పారదర్శకంగా, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసే మధ్యవర్తులను, దళారులను అస్సలు నమ్మొద్దన్నారు. అడ్డదారులు తొక్కి జీవితాలను పాడుచేసుకోవద్దని, కష్టపడి చదివి ప్రతిభతోనే ఆర్టీసీ కొలువులు సాధించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను మోసం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తప్పవు నాగిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Next Story






