పన్నుల రాబడుల్లో తెలంగాణ దేశంలోనే తొలి స్థానం: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 19 |
పన్నుల రాబడుల్లో తెలంగాణ దేశంలోనే తొలి స్థానం: మంత్రి హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పన్నుల రాబడుల్లో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 2022-23 సంవత్సరంలో రూ.72, 564 కోట్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాల పెంపుపై హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్‌లో సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. దేశంలోనే అభివృద్ధికి సూచికగా తెలంగాణను నిలబెట్టాలన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంక్షేమ పథకాలు నిర్వహిస్తోందని చెప్పారు. రాష్ట్ర ఆదాయంలోని ప్రతి రూపాయిని పేద ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

Also Read:

హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ కార్టూన్ (6-5-2023)

Next Story