సవాళ్లతో వేడెక్కిన తెలంగాణ రాజకీయం.. రాజీనామాకు సిద్ధం!

by Disha Web Desk 14 |
సవాళ్లతో వేడెక్కిన తెలంగాణ రాజకీయం.. రాజీనామాకు సిద్ధం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేళ సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతల మధ్య మాటల తూటాలై పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ గెలుపు, ఇతర వైఫల్యాలను ఎండగడుతూ.. చర్చలకు సిద్దమా..? అంటూ ఛాలెంజ్ చేస్తూ కార్యకర్తల్లో మాత్రం జోష్ నింపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు రావాలని గులాబీ బాస్ కేసీఆర్‌కు తాజాగా ఓ కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మరోవైపు హైదరాబాద్ తాగునీటి సరఫరాపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. అలాగే ప్రభుత్వం ఆగస్టు 15లోగా పంట రుణమాఫీని అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి సవాల్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు స్వీకరించారు.బీఆర్ఎస్ కనీసం 8 ఎంపీ సీట్లు గెలవగలిగితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సవాల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిలు కూడా లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుంటే తాను చేయించుకుంటానని కేటీఆర్ తాజాగా ఛాలెంజ్ చేశారు. మరోవైపు తెలంగాణలో 14 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ నేత ఆలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. లేని పక్షంలో రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాకకు ఎన్ని నిధులు, ప్రాజెక్టులు తీసుకొచ్చారో బయటపెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. రఘునందన్ రావు దానిని అంగీకరించి బుక్‌లెట్‌ను విడుదల చేసి చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని తిరిగి సవాల్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు అయినా గెలవాలని కేటీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి స్థానంలో తనపై పోటీ చేయాలని చాలెంజ్ చేశారు.



Next Story

Most Viewed