మైనారిటీ గురుకులాల్లో కొత్త టైం టేబుల్..

by Disha Web Desk 13 |
మైనారిటీ గురుకులాల్లో కొత్త టైం టేబుల్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో, జూనియర్ కాలేజిల్లో కొత్త టైం టేబుల్‌ను తెలంగాణ మైనార్టీ రెసిడెన్సీయల్ ఎడ్యూకేషనల్ సొసైటీ గురువారం జారీ చేసింది. విద్యార్థులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల సమయం వరకు రోజు వారి దినచర్యను కొత్త టైం టేబుల్‌ను షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. దిన చర్యలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 4.30 గంటల వరకే బోధన ఉంటుదని తెలిపారు. ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

బీసీ గురుకులాల్లో కూడా అమలు చేయాలి : టీఎస్ యూటీఎఫ్

మైనార్టీ గురుకులాల్లో కొత్త టైం తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేశామని టీఎస్ యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఆగస్టు 1 నుంచే నూతన టైం టేబుల్ అమలు జరుగుతుందన్నారు. బీసీ గురుకులాల్లో కూడా నూతన టైం టేబుల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed