మస్క్ మజా..! తెలంగాణ ఐటీ మంత్రి ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 14 |
మస్క్ మజా..! తెలంగాణ ఐటీ మంత్రి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, భారత ప్రధాని మోడీని కలవడానికి ఏప్రిల్ 22న దేశంలో పర్యటించే అవకాశం ఉంది. అయితే భారత్‌లో కూడా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి తేవడానికి.. సుమారు రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయాడానికి టెస్లా కంపెనీ సిద్దమైంది. అయితే దీని కోసం కొన్ని రాష్ట్రాల్లో అనువైన ప్రదేశాలను టెస్లా అధికారుల బృందం పరిశీలిస్తుంది. టెస్లా అధికారులు గుజరాత్, మహారాష్ట్రతో సహా వివిధ ప్రదేశాలను చూస్తున్నారు. అయితే వివిధ రాష్ట్రాల అధికారులు టెస్లా ప్లాంట్ తమ రాష్టంలోనే పెట్టాలని పోటీపడుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో టెస్లా యూనిట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎలాన్‌మస్క్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘యంగ్ స్టేట్ అయిన తెలంగాణ భారత్‌కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ ట్వీట్‌లు వేయకుండా వారి టీంను కాలవాలని నెటిజన్లు మంత్రిని విమర్శిస్తున్నారు. టెస్లా తెలంగాణకు రావాలంటే మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ హెల్ప్ తీసుకోవాలని నెటిజన్లు సూచించారు. ఎలాగైన టెస్లా యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయించాలని నెటిజన్లు ఐటీ మంత్రికి సూచించారు.



Next Story

Most Viewed