బ్రేకింగ్: డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న డ్రగ్స్‌ను, రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరో రెండు ప్రత్యేక వింగ్‌లను ఏర్పాటు చేయనుంది. డ్రగ్స్ కట్టడి కోసం నార్కోటిక్ బ్యూరో, సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు సైబర్ సెక్యూరిటీ వింగ్‌‌ను ప్రారంభించింది. ప్రస్తుత హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నార్కోటిక్ బ్యూరో చీఫ్‌గా వ్యవహారించనుండగా.. సైబర్ సెక్యూరిటీ వింగ్‌కు చీఫ్‌గా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను నియమించింది. ఈ రెండు ప్రత్యేక వింగ్‌ల ద్వారా రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, సైబర్ నేరాలు తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది.

Next Story

Most Viewed