రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో మరో కొత్త మున్సిపాలిటీ

by Disha Web Desk 2 |
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో మరో కొత్త మున్సిపాలిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. ఈ శుక్రవారం 20 వార్డులతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా అవతరించింది. అంతేకాదు.. జనకపూర్, గొడవెల్లిని మున్సిపాలిటీలో విలీనం చేసింది. కాగా, ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇంద్రవెల్లి ప్రాంతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది.

ఆయన టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నాక.. మొదటి సభ ఇంద్రవెల్లిలోనే నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో సక్సెస్ అయ్యారు. మరోసారి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తొలిసారి సీఎం హోదాలో మరోసారి ఇంద్రవెల్లి సభ నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రజల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. సీఎం ఇంద్రవెల్లి పర్యటనలపై ఇటీవల మంత్రి సీతక్క కూడా ఇదే చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ నాంది పలికిందని సీతక్క అన్నారు. అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

Next Story