బిగ్ బ్రేకింగ్: సెర్ప్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ శుభవార్త

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: సెర్ప్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ శుభవార్త
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కనిష్ఠ పేస్కేల్ రూ.19 వేల నుంచి రూ. 58,850 కాగా, గరిష్ట పే స్కేల్ రూ. 51,320 నుంచి 1,27,310 గా నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పే స్కేల్ వర్తిస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ట్వీట్ చేస్తూ సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం సెర్ప్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అయిందన్నారు.

కొత్త పే స్కేల్:

మండ‌ల్ స‌మాఖ్య క‌మ్యూనిటీ కోఆర్డినేట‌ర్స్: రూ. 19,000 – 58,850

మండ‌ల్ స‌మాఖ్య క‌మ్యూనిటీ కోఆర్డినేట‌ర్స్‌( మండ‌ల్ రిప్రజెంటెటివ్ ప‌ర్సన్స్): రూ. 19,000 – రూ. 58,850

మండ‌ల్ బుక్ కీప‌ర్స్: రూ. 22,240 – రూ. 67,300

క‌మ్యూనిటీ కో ఆర్డినేట‌ర్స్: రూ. 24,280 – రూ. 72,850

అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజ‌ర్స్: రూ. 32,810 – రూ. 96,890

డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజ‌ర్స్: రూ. 42,300 – 1,15,270

ప్రాజెక్టు మేనేజ‌ర్స్: రూ. 51,230 – రూ. 1,27,310

డ్రైవ‌ర్స్: రూ. 22,900 – రూ. 69,150

ఆఫీస్ సబార్డినేట్స్: రూ. 19,000 – రూ. 58,850

అడ్మినిస్ట్రేష‌న్ అసిస్టెంట్ ప్రాజెక్టు సెక్రటరీస్: రూ.24,280 – రూ. 72,850


Next Story

Most Viewed