ఆ శాఖలోని ఆరుగురు అధికారులపై వేటు..రేవంత్ రెడ్డి షాకింగ్ డెసిషన్ ..

by prasad |
ఆ శాఖలోని ఆరుగురు అధికారులపై వేటు..రేవంత్ రెడ్డి షాకింగ్ డెసిషన్ ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలోని అవినీతి అధికారులపై కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు ఆఫీసర్లపై వేటు వేసింది. రాష్ట్ర గనులు, భూగర్భ శాఖలో డిప్యుటేషన్ పై జీఎంలుగా పని చేస్తున్న పాండురంగారావు, దేవేందర్ రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్లు దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ ను వారి మాతృ సంస్థలకు టాన్స్ ఫర్ చేసింది. వీరి అవినీతిపై ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపిన ప్రభుత్వం ఈ మేరకు తాజాగా చర్యలు తీసుకుంది. మరో వైపు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్న పలువురు అధికారులపై రెయిడ్స్ చేసిన అధికారులు వారిని అరెస్ట్ చేశారు. వారిలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ను అరెస్ట్ చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ అవినీతి, అక్రమాలకు పాల్పడిన పలువురు అధికారులు ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

Next Story