రీల్స్ చేసే వారికి తెలంగాణ సర్కార్ తీపికబురు.. ఏకంగా 75వేలు పొందచ్చు ఇలా..

by Dishanational2 |
రీల్స్ చేసే వారికి తెలంగాణ సర్కార్ తీపికబురు.. ఏకంగా 75వేలు పొందచ్చు ఇలా..
X

దిశ, వెబ్‌డెస్క్ : రీల్స్ చేసే వారికి తెలంగాణ సర్కార్ తీపికబురు అందించింది. ప్రస్తుతం యాత్‌పై రీల్స్ ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న వారి నుంచి పెద్దవారి వరకు చాలా మంది రీల్స్ పైనే ఎక్కు సమయం వెచ్చిస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. ప్రస్తుతం డ్రగ్స్ వాడకం ఎక్కువైపోతుంది. యూత్ డ్రగ్స్‌కు బానిసై తమ జీవితాలను నాశం చేసుకుంటుంది. అయితే డ్రగ్స్ సమాజంపై ఎలా దుష్ప్రభావం చూపిస్తుందో కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపెట్టడానికి శ్రీకారం చుట్టుంది.తెలంగాణ రాష్ట్ర పోలీసులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. జూన్ 26 న అంతర్జాతీయ మాదకద్రవ్యాలు మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్బంగ ఓ షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించనున్నారు.

ఈ మేరకు ‘డ్రగ్స్ అండ్ ఇట్స్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ’ పేరుతో కాంటెస్ట్ నిర్వహించబడుతుంది. దీనిక 18 ఏళ్ల వయస్సు నుండి పైబడినవారందరూ అర్హులు. ‘డ్రగ్స్ వాడకం సమాజంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుంది.. దాని వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు, ఆ వ్యక్తుల కుటుంబసభ్యులు పడే బాధలను కళ్ళకు కట్టినట్లు ఈ రీల్స్ ద్వారా చూపించాల్సి ఉంటుంది. మూడు నిమిషాల వ్యవధిలో షార్ట్ వీడియో ని రూపొందించి, దాన్ని జూన్ 20, 2023లోపు సబ్మిట్ చెయ్యాలి. ఈ పోటీలో నెగ్గిన వారికి నిలిచిన పురస్కారాలు అందజేయబడతాయి. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 75,000, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 50,000, మూడో స్థానంలో వారికి 30,000ల నగదు బహుమతి అందజేయబడుతుంది. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వారు మరింత సమాచారం కోసం 96523 94751 నంబర్‌ ను సంప్రదించాలి.

Also Read..

దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ : మంత్రి హరీష్ రావు


Next Story