బిగ్ బ్రేకింగ్: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. PRC ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్

by Satheesh |
బిగ్ బ్రేకింగ్: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. PRC ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని ( PRC) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పీఆర్సీని ఏర్పాటు చేస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఆర్సీ కమిటీ చైర్మన్‌గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్), సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్)ను నియమించారు. ఈ కమిటీ 6 నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్‌ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story