Big Breaking: మేడారం మహా జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ సీఎం

by Disha Web Desk 3 |
Big Breaking: మేడారం మహా జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ప్రకృతిని ఆరాధించే మహోన్నత సంస్కృతిని కలిగిన తెలంగాణలో ఆ ప్రకృతి ఒడిలో పుట్టి.. ఈ మట్టిలో దేవతులుగా వెలసి కోరిన వారికి కొంగు బంగారమై.. ఇంటి ఇలవేల్పులుగా పూజలందుకుంటున్న తెలంగాణ ఆడబిడ్డలు మేడారం సమ్మక్క సారక్కల జాతర ప్రతి సంవత్సరం కన్నుల విందుగా జరుగుతోంది.

ఈ ఏడాది కూడా సమ్మక్క సారక్కల జాతరను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు మేడారం జాతకారకు సంబంధించిన మేడారం మహా జాతర పోస్టర్ ను డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

కాగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క, శ్రీమతి కొండా సురేఖ, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక నిన్న మేడారం జాతర పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా ఎస్పీ శబరిష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ నేపథ్యంలో మొదటగా వీఐపీ పార్కింగ్ స్థలాన్ని , ఆర్టీసీ బస్ స్టాండ్ , హరిత హోటల్ , జంపన్న వాగు స్తాన ఘటలు, స్థూపం రోడ్ , కొత్తూరు సమీపంలో మరుగు దొడ్ల పనులను పరిశీలించారు. ఆ తరువాత కన్నేపల్లి గ్రామం లోని సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించారు. అక్కడ స్థానిక పూజారితో మాట్లాడిన సీతక్క దేవాలయ సమీపం లో మరుగు దొడ్లు, త్రాగు నీరు, లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.



Next Story

Most Viewed