- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హస్తిన విజయంతో తెలంగాణలో కమలనాధుల విజయోత్సవాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందండటంతో రాష్ర్ట వ్యాప్తంగా పలు జిల్లాలో పార్టీ శ్రేణులు శనివారం సంబరాలు నిర్వహించారు. పార్టీ నాయకులతో పాటు స్థానిక ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. దేశంలో గత 10 సంవత్సరాల్లో ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు అక్కడి ప్రజలు ఆకర్షితులై బీజేపీని ఆదరించినట్లు పలువురు నేతలు పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో అధ్యక్షులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పిలిపించి పార్టీ పతకాలతో ర్యాలీ నిర్వహించి పార్టీ కార్యాలయాల ముందు బాణాసంచాలు పేల్చి మోడీ నాయకత్వం జిందాబాద్అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పార్టీ సీనియర్నాయకులు మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు అవినీతి సర్కార్ను సాగనంపి, సమర్థ పాలన కోసం కమలం పార్టీకి అధికారం కట్టబెట్టారన పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా అవినీతి, అసమర్ధ పాలనకు చరమగీతం పాడాలని, త్వరలోజరిగే ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు గెలిచేలా కార్యకర్తలు పాటు పడాలని సూచించారు.
రాష్ట్ర కార్యాలయం వద్ద కనిపించని హడావుడి
ఢిల్లీ భారీ విజయంతో రాష్ట్ర కార్యాలయం వద్ద విజయోత్సవాలు పెద్ద ఎత్తున చేస్తారని నగర శ్రేణులు కదిలివచ్చారు. కానీ పార్టీ పెద్దలు నగరానికి చెందిన సీనియర్నేత రాజుగౌడ్ ఆకాల మరణంతో సంతాప సూచికంగా ఎలాంటి హంగా మా చేయలేదు. పార్టీ గెలుపుపై అందరు శుభాకాంక్షలు తెలుపుకొని భవిష్యత్తులో పార్టీ నిర్మాణంలో అందరు భాగస్వాములైన హస్తిన తరహాలో తెలంగాణలో అధికారం సాదించేలా కృషి చేయాలని సీనియర్లు సూచించారు.