మోడీ జాబ్ క్రియేటర్.. KCR ట్రబుల్ మేకర్: సీఎంపై బండి సెటైర్

by Disha Web Desk 19 |
మోడీ జాబ్ క్రియేటర్.. KCR ట్రబుల్ మేకర్: సీఎంపై బండి సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ట్రబుల్ మేకర్ అని.. ఇబ్బందులు పెట్టడమే ఆయన పని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరోసారి ఫైర్ అయ్యారు. గడిచిన 7 నెలల్లో రోజ్ గార్ మేళా కింద 3.59 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, గత 11 నెలల కాలంలో ప్రైవేట్ రంగంలో 1.31 కోట్ల ఉద్యోగాలను ప్రధాని మోడీ కల్పించారని మంగళవారం ట్వీట్ చేశారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ జాబ్ క్రియేటర్‌గా మారితే.. బిస్వాల్ కమిటి నివేదికను తుంగలోకి తొక్కి పేపర్ లీకులతో సీఎం కేసీఆర్ ట్రబుల్ మేకర్‌గా మారారని ఎద్దేవా చేశారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకు ద్వారా 30 లక్షల మంది యువత భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ట్రబుల్ మేకర్ కేసీఆర్‌ను పక్కన పెట్టి జాబ్ క్రియేటర్ మోడీని ఎంచుకోవడం ఖాయం అన్నారు.


Next Story

Most Viewed