క్రైమ్ క్యాపిటల్‌గా తెలంగాణ.. పట్టపగలు మహిళపై కత్తులతో దాడి

by Disha Web |
క్రైమ్ క్యాపిటల్‌గా తెలంగాణ.. పట్టపగలు మహిళపై కత్తులతో దాడి
X

దిశ, తెలంగాణ బ్యూరో : క్రైమ్​క్యాపిటల్​గా తెలంగాణ మారిందని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లోని తహసీల్దార్ ​కార్యాలయం ఎదుట పట్టపగలే 48 ఏండ్ల మహిళ కత్తిపోట్లకు గురికావడం చూస్తే తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో ఎంత అధమ స్థాయిలో ఉన్నామో అర్థమవుతోందని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కొందరు కసాయిలకు చట్టంపై భయం లేకపోవడంతో 8 ఏండ్లుగా ఈ క్రూరత్వాలు పెరిగాయన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఇవి జరుగుతున్నాయని, తమ నాయకులు తమను కాపాడుతారనే నమ్మకంతో ఇలాంటి ఘాతుకాలకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి దారుణ హత్యలు జరిగిన ప్రతిసారీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని హామీలిచ్చి మరిచిపోతున్నారని, పోలీసులు విఫలమయ్యారనేందుకు ఇది నిదర్శనమని సుభాష్ ​మండిపడ్డారు. తెలంగాణలో మహిళలకు ఏ మాత్రం భద్రత లేదని ఈ ఘటనలు చూస్తే అర్థమవుతుందని ఆయన తెలిపారు. మహిళా భద్రత, సాధికారత అంటూ కేసీఆర్ తప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని, ఇవన్నీ అబద్ధాలేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు, షీ టీమ్స్ కూడా పనికిరాకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Next Story