హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం

by Disha Web Desk 2 |
హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వీడటం లేదు. టెక్నికల్ సమస్యలతో తరచూ మెట్రో రైలు నిలిచిపోతున్నాయి. తాజాగా సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్ వద్ద సాంకేతిక సమస్యతో ట్రైన్ ఆగిపోయింది. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్ మార్గంలో వెళ్లే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలోనూ పలు మార్లు మెట్రో రైలులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

Next Story