- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
అది మానుకోవాలి.. రేవంత్ రెడ్డికి తమ్మినేని వీరభద్రం వార్నింగ్
by Disha Web Desk 4 |

X
దిశ, తెలంగాణ బ్యూరో: విధానాలే ప్రాతిపదికగా పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెత్త వాగుడు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఆర్‌ఎస్ అధినేతకు అమ్ముడుపోయారంటూ కమ్యూనిస్టులపై రేవంత్‌రెడ్డి నోరుపారేసుకున్నాడని తీవ్రంగా ఖండించారు. మునుగోడు ఉప ఎన్నికలో మతోన్మాద బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలు ముందుకుసాగుతున్నాయని స్పష్టం చేశారు. బీజేపీని నిలవరించడం, ఓడిరచడం ప్రధాన లక్ష్యంగా ఎంచుకోకుండా టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకే నష్టమని సూచించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రమాదాన్ని గుర్తించి కమ్యూనిస్టులపై బురద చల్లడం మానుకుంటే మంచిదని తమ్మినేని హితువు పలికారు.
Next Story