తమ్మినేని వీరభద్రం సోదరుడు దారుణ హత్య

by Disha Web Desk 4 |
తమ్మినేని వీరభద్రం సోదరుడు దారుణ హత్య
X

దిశ, ఖమ్మం రూరల్​: ఖమ్మం జిల్లా రూరల్​ మండలం తెల్దారుపల్లి గ్రామంలో దారుణ హత్య జరిగింది. దుండగులు వేటకొడవళ్లతో, గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసి మరి విచక్షణారహితంగా హతమర్చారు. రూరల్​ మండలం తెల్దారుపల్లి గ్రామం గత నలబై సంవత్సరాలుగా కూడా సీపీఎం పాలనలో కొనసాగుతోంది. సీపీఎం పార్టీ నాయకుల విధానాలు నచ్చక గత ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన తమ్మినేని క్రిష్ణయ్య ఒంటరిపొరు ప్రకటించి ఎంపీటీసీ బరిలో తన భార్యను నిలబెట్టి గెలిపించుకున్నారు. తరువాత జరిగిన సహకార ఎన్నికల్లో సైతం ఆయనే నిలబడి గెలిచాడు. తరువాత మాజీ మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్​ఎస్​ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలో తరుచూ అటెంమెంట్​ మర్డర్​లు జరుగుతూనే ఉన్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వరుసకు సొదరుడు అవుతాడు. గతంలో కూడా క్రిష్ణయ్య తనకేదైనా జరిగితే సీపీఎం నాయకులదే బాధ్యత అని అరోపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అగస్టు 15 కావడంతో సొమవారం తనకు ఉన్న కారు బయటకు వెళ్లడంతో డ్రైవర్​ కొప్పుల ముత్తేశం(ముత్తయ్య)తో కలిసి పొన్నేకల్లులో గల రైతువేదిక వద్ద జాతీయ జెండా అవిష్కరణలో పాల్గొని అక్కడి నుంచి పక్కనే ఉన్న గుర్రలపాడు గ్రామంలో ఓ వ్యక్తి మరణిస్తే పరామర్శించి తిరిగి ఇంటికి వెళ్తుండగా మద్దులపల్లి డబుల్​బెడ్​రూమ్​ ఇండ్ల వద్ద గల దొబిఘాట్​ వద్దకు వెళ్లగానే వెనకు నుంచి ఆటోలో వచ్చి టూవీలర్​ ఢీకొట్టడంతో క్రిష్ణయ్య, డ్రైవర్​ ముత్తయ్య కింద పడ్డారు. దీంతో వెంటనే దుండగులు తమ వద్ద ఉన్న కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి తలపై, ముఖం పై విచక్షణారహితంగా దాడి చేసి హతమర్చారు. హతమార్చడమే కాకుండా రెండు చెతులను నరికి తీసుకుని వెళ్లారు. రక్తపుమడుగులో క్రిష్ణయ్య తూదిశ్వాస విడిచారు. హంతుకులు నూకల లింగయ్య, బోడపల్ల శ్రీను( మెంటల్​ శ్రీను) , గజ్జి క్రిష్ణస్వామి, చెవిటి నాగేశ్వరరావులతో పాటు మరికొంతమంది ఉన్నారని ప్రత్యక్షసాక్షి ముత్తయ్య తెలిపాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని విచారణ చేస్తున్నారు.

రాజకీయహత్యే అంటున్న కుటుంబ సభ్యులు

తమ​ అభిమాన నాయకుడి మరణానికి గల కారణం సీపీఎం పార్టీనే అని తమ్మినేని క్రిష్ణయ్య అభిమానులు అరోపిస్తున్నారు. గ్రామంలో నిత్యం ఎదో ఒకటి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని అరోపిస్తున్నారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమే అని భార్య మంగతాయి అరోపిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందని పలువురు అరోపిస్తన్నారు.





Next Story

Most Viewed