నేడు T-BJP కీలక సమావేశం.. దానిపైనే చర్చ!

by Dishanational2 |
నేడు T-BJP కీలక సమావేశం.. దానిపైనే చర్చ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ప్రశిక్షణ తరగతులు ఇవాల్టితో ముగియనున్నాయి. మూడు రోజుల్లో భాగంగా రెండు రోజుల శిక్షణ తరగతులు ఇప్పటికే పూర్తయ్యాయి. కాగా చివరి రోజు సమావేశాలు కీలకంగా మారునున్నాయి. ఇవ్వాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఎలా ఢీకొట్టాలి, ప్రతి నియోజకవర్గంలో పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, చేరికలు, ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాలకు ఎత్తుకు పైఎత్తులు ఎలా వేయాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చ కొనసాగనుంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed