- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
స్టార్ హీరోయిన్ భర్తకు సమన్లు.. కేసు ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: బిల్లా, సింహ సినిమాలతో తెలుగు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నమిత. అయితే ఓ కేసులో నమిత భర్తకు సేలం సెంట్రల్ క్రైం బ్రాంచి పోలీసులు సమన్లు పంపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ చైర్మన్ పదవికి సంబంధించి జరిగిన మోసం కేసులో నమిత భర్త చౌదరి సహా ఇద్దరు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ అధ్యక్షుడి పదవి ఇప్పిస్తామంటూ సేలంకు చెందిన ముత్తురామన్ జాకిర్ ప్రాంతానికి చెందిన గోపాల్ స్వామి వద్ద రూ.50లక్షల నగదు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు.
అయితే ఈ పదవిలో ఇటీవల నమిత భర్త నియమితులయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముత్తురామన్, కౌన్సిల్ జాతీయ కార్యదర్శి దుశ్యంత్ యాదవ్ ను గత నెల 31న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తాజాగా నమిత భర్త చౌదరితో పాటు ముత్తురామన్ పీఏ, బీజేపీ స్టేట్ మీడియా వింగ్ ఉపాధ్యక్షుడు మంజునాథ్ విచారణకు హాజరు కావాలని సూరమంగళం పోలీసులు సమన్లు పంపారు. వీరు విచారణకు హాజరు కాకపోవడంతో కేసును సెంట్రల్ క్రైం బ్రాంచికి బదిలీ చేశారు.