రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: వ్యవసాయ శాఖ మంత్రి

by Mahesh |
రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: వ్యవసాయ శాఖ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్తను అందించారు.రెండు మూడు రోజుల్లో ఆయిల్ ఫామ్, అంతర పంటల రాయితీ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ సేద్యం కంపెనీలకు సైతం రూ.55.36 కోట్ల బకాయిలను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక మీద నుంచి రైతులకు పంటల సాగు బకాయిలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. అలాగే 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన మంత్రి వ్యవసాయ అధికారులకు సూచించారు.Next Story

Most Viewed