నారాయణ కాలేజీలో బాలికపై లైంగికదాడి..! కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన

by karthikeya |
నారాయణ కాలేజీలో బాలికపై లైంగికదాడి..! కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
X

దిశ, శేరిలింగంపల్లి: ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల పాలిట యమపాశాలుగా మారాయి. నిన్న మాదాపూర్ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ ఘటన మరువక ముందే అదే మాదాపూర్ నారాయణ కాలేజీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఈ సారి ఏకంగా అమ్మాయిపై లైంగిక దాడి జరగడం ఆందోళనకు గురి చేస్తుంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని నారాయణ కాలేజీ ఐఐటీ అకాడమీ సింధు క్యాంపస్ లో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ఏసీ ఎలక్స్ట్రీషియన్ లైంగిక దాడికి పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ బుధవారం నారాయణ కాలేజీ క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగాయి. రెండు రోజుల క్రితం అమ్మాయిపై లైంగికదాడి జరిగినా విషయం బయటకు పొక్కకుండా కాలేజీ యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అమ్మాయిని ఇంటికి పంపినట్లు విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే మా క్యాంపస్ లో అలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని బుకాయిస్తున్నారు. విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహించాయి. నారాయణ కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story