- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విచ్చలవిడిగా బోగస్ విత్తన కంపెనీలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బోగస్ విత్తనోత్పత్తి కంపెనీలున్నాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి హెచ్చరించారు. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పిలవబడుతున్న రాష్ట్రంలో నకిలీ విత్తనం రాజ్యమేలుతోందన్నారు. ఆదివారం హాకా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో అనేక మల్టీ నేషనల్ కంపెనీలు నకిలీ విత్తనాలు సరఫరా చేసి రైతులకు నట్టేట ముంచాయన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆదేశాలమేరకు ఇటీవల ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తే భయంకరమైన నిజాలు బయటపడ్డాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల అమాయకత్వం ఆసరాగా చేసుకొని సీడ్ కంపెనీలు, ఏజెంట్లు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో సింజెంట, హైటేక్, బియర్ అనే మూడు మల్టి నేషనల్ కంపెనీలు చేస్తున్న మోసాలు అన్ని ఇన్ని కావన్నారు. విత్తనోత్పతితో కోసం మల్టి నేషనల్ కంపెనీలు ఆర్గనైజర్స్ కు ఏ ధర ఇస్తున్నాయో రైతులకు తెలియదు. రైతులకు ఇచ్చే ధర కూడా కంపెనీలకు తెలియదన్నారు. నోటి మాట, తెల్లకాగితాలపై రాసుకోవడం తప్పా ఎక్కడా పక్కా లెక్కలు, బిల్లులు ఉండవని తెలిపారు. ఆర్గనైజర్స్ రైతులకు కావాల్సిన ఇతర పురుగు మందులు ఇచ్చి రైతులకు నుంచి 5 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని, ఇలాంటి దందా ఒక్కో జిల్లాలో ఒక్కో రకం ఒప్పందం చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. ఈ మూడు మండలాల్లో మొత్తం 2700 ఎకరాల్లో నకిలి విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. మల్టి నేషనల్ కంపెనీలకు ఆర్గనైజర్స్ గా ఉన్న సురేష్ బాబు, నర్సింహ మూర్తిలు ఇద్దరు రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చి ప్రాణాంతకమైన పురుగు మందులు ఉపయోగించేలా చేశారని గుర్తించినట్లు వెల్లడించారు.
విషంగా మారినా మొక్క జొన్న పంటలు
మొక్కజొన్న విత్తనోత్పత్తి కోసం వెంకటాపురం, వాజేడు, కన్నాయి గూడెం మండలాల్లో వేలాది ఎకరాల్లో మల్టినేషన్ కంపెనీలు రైతులతో సాగుచేస్తున్నాయి. విత్తనోత్పతితో కోసం సాగుచేస్తున్న మొక్కజొన్న పంట లో ఆశించిన స్థాయిలో మొక్కజొన్న కంకి రాకపోవడంతో ఆర్గనైజర్లు విష రసాయాలు పిచ్చికారి చేయాలని చెప్పడంతో రైతులు వాటిని పిచ్చికారి చేయడంతో ఆ చేలు అన్ని రసాయనాలతో నిండిపోయాయి. వాటిని తిన్న పదుల సంఖ్యలో పశువులు చనిపోయాయి. మొక్కజొన్న కంక్కి తిన్న కూలీలు కూడా చనిపోయారు. ఇక పంట సాగుచేసే కూలీలు రోగాల భారిన పడుతున్నారు. అనేక రకాల సమస్యలతో ఆ మూడు గ్రామాల రైతులు ఇబ్బంది పడుతున్నట్లుగా సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. గత మూడు రోజుల క్రితం ములుగు జిల్లాలకు వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు, సామాజిక వేత్త దొంతి నర్సింహారెడ్డి,కిసాన్ కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటించారు.
సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతాం
ములుగు జిల్లాలో జరిగిన ఘటన దారుణమని దీనిపై సర్కార్ సీరియస్ గా ఉందని మొన్న సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలో వరి విత్తనోత్పత్తి లో బోగస్ విత్తనంతో రైతులు ఆగమయ్యారని గుర్తుచేశారు. బోగస్ సీడ్ కంపెనీలను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. బోగస్ కంపెనీలపై కఠిన చర్యలుంటాయని, త్వరలో సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని తెలిపారు.