ఆ సమయంలో ఇంట్లో నుండి బయటకు రావొద్దు: రాష్ట్ర ప్రజలకు హెల్త్ డైరెక్టర్ కీలక సూచన

by Disha Web Desk 19 |
ఆ సమయంలో ఇంట్లో నుండి బయటకు రావొద్దు: రాష్ట్ర ప్రజలకు హెల్త్ డైరెక్టర్ కీలక సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయని, సగటున 42 డిగ్రీలు నమోదవుతుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్యశాఖ ప్రజా రోగ్య సంచాలకులు డా జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో హీట్ వేవ్​అలర్ట్ ఉన్నట్లు మంగళవారం మీడియాకు తెలిపారు. మరో వారం రోజుల పాటు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతేనే తగిన జాగ్రత్తలతో వెళ్లాలన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఎండ సమయంలో ఇళ్లకే పరిమితం కావాలన్నారు.

ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ సాప్ట్​డ్రింక్స్, హై ప్రోటీన్​పుడ్​వంటివి తీసుకోవద్దన్నారు. స్కిన్ మీద రెడ్​రసేష్, డ్రై స్కిన్, హెడ్​ఏక్, మజిల్ నొప్పులు వంటివి ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలన్నారు. కనీసం ప్రతీ రోజు మూడు లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సీజనల్​ప్రూట్స్‌ను ఎక్కువగా తినాలన్నారు. ఎండ తాకిడి తగలకుండా గొడుగు, క్యాప్, పుల్ హ్యాండ్ దుస్తులు వంటివి ధరించాలన్నారు. వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు న్యూస్‌‌లో తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


Next Story

Most Viewed