ఏదిఏమైనా సరే దసరా రోజు ఇదొక్కటి మాత్రం మరువరూ..!

by Disha Web |
ఏదిఏమైనా సరే దసరా రోజు ఇదొక్కటి మాత్రం మరువరూ..!
X

దిశ, వెబ్ డెస్క్: దసరా పండుగను తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. చెడుపై గెలిచిన విజయం గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. ఎక్కడున్నా సరే కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకుంటారు. ఈరోజు దుర్గమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా రావణ వద కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. అనంతరం పాల పిట్టను చూసి జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఆ తర్వాత జమ్మి ఆకును పంచుకుంటూ ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కచోట చేరి ఆనందంగా గడుపుతారు. మహిళలు బతుకమ్మ ఆడుతారు. ముఖ్యమైన విషయమేమిటంటే పాలపిట్టను ఖచ్చితంగా చూస్తారు. ఇంకో విషయమేమంటే... కుటుంబ సభ్యుల్లో ఎవరు ఎంత దూరంలో ఉన్నా సరే ఈరోజు ఖచ్చితంగా ఇంటికి చేరుకుని, కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు.

Next Story

Most Viewed