తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-01 15:46:33.0  )
తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలకు పది మంది ప్రత్యేక అధికారుల(Special officers)ను నియమించింది. 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Santhi Kumari) ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌కు- ఆమ్రపాలి, రంగారెడ్డి- దివ్య, మహబూబ్‌నగర్- రవి, నల్లగొండ- అనితా రామచంద్రన్, వరంగల్- టీవీ కృష్ణారెడ్డి, మెదక్- దాసరి హరిచందన, నిజామాబాద్- ఏ.శరత్, ఆదిలాబాద్- ఇలంబరితి, కరీంనగర్- ఆర్వీ కర్ణన్, ఖమ్మం- కే.సురేంద్ర మోహన్‌లకు బాధ్యతలు అప్పగించారు. కాగా, అక్టోబర్ 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఈ పరిశీలను సమర్థవంతంగా చేపట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 238 ప్రాంతాల్లో నిర్వహించబోయే క్షేత్రస్థాయి పరిశీలనను ఈ ప్రత్యేక అధికారులు మానిటరింగ్ చేస్తారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed