డిగ్రీలో వేకెన్సీ సీట్ల భర్తీకి స్పెషల్ డ్రైవ్.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?

by Disha Web Desk 19 |
డిగ్రీలో వేకెన్సీ సీట్ల భర్తీకి స్పెషల్ డ్రైవ్.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ ద్వారా డిగ్రీ సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా డిగ్రీల ఖాళీ సీట్ల భర్తీకి ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుదన్నారు. ఈనెల 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు. కాగా ఈనెల 21వ తేదీ నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లకు చాన్స్ ఇచ్చారు. ప్రత్యేక కేటగిరీకి చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా 25వ తేదీన ఉంటుందన్నారు. 29న సీట్ల కేటాయించనున్నట్లు స్పష్టంచేశారు. 29, 30 తేదీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ తేదీల్లోనే స్వయంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. స్పాట్ అడ్మిషన్లు వచ్చే నెల 3, 4 తేదీల్లో ఉంటాయని లింబాద్రి స్పష్టంచేశారు.

Next Story

Most Viewed