టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ఎలా మారుస్తారు... ఇంతకు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

by Dishanational1 |
టీఆర్ఎస్‌ను  బీఆర్ఎస్‌గా ఎలా మారుస్తారు... ఇంతకు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లుగా తెలిసింది. అయితే, ఈ విషయంలో చాలామందికి ఓ డౌట్ ఉంది. అసలు పార్టీల పేరును ఎలా మారుస్తారు.. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే, ఏ పార్టీకైనా తన పార్టీ పేరును మార్చుకునే అవకాశముంది. కాకపోతే ఆ పార్టీ సభ్యుల ఆమోదం ఉంటేనే అది సాధ్యమవుతుంది. మొదటగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పేరు మారుస్తున్నట్లుగా తీర్మానం చేసి, అందుకు సభ్యులంతా ఆమోదం తెలుపుతున్న తీర్మానాన్ని కేంద్రంలోని ఈసీ(కేంద్ర ఎన్నికల సంఘం) కి సమర్పించి దరఖాస్తు(అఫిడవిట్) చేసుకోగా పరిశీలిస్తుంది. అనంతరం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు నెల రోజుల గడువు ఇస్తుంది. ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే దాన్ని ఆమోదిస్తుంది.


Next Story

Most Viewed