ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ పోచారం

by Dishafeatures2 |
ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ పోచారం
X

దిశ, బాన్సువాడ : నియోజకవర్గంలోని రుద్రుర్ మండలం బొప్పపుర్ గ్రామంలో శ్రీ దక్షణముఖ సంజీవిని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రతేక పూజ కార్యక్రమం నిర్వహించి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద్భంగా ఆలయ కమిటీని నిర్మాణ విశిష్టతలు విగ్రహ విశిష్ట ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, ఏ సీ పీ కిరణ్ కుమార్, జెడ్పీటీసీ నరోజి గంగారాం,ఎంపీపీ అక్కపల్లి సుజాత, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, ఎంపీటీసీ మంత్రి లక్ష్మి , సర్పంచ్ బాపూజీ సావిత్రి , బీ అర్ ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి నేరుగంటి బాలరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ తోట సంగయ్య, పాక్స్ ఛైర్మెన్ బద్దం సంజీవ్ రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మెన్ పట్ల నర్సింలు, నాయకులు సురేందర్, మారుతి, స్వామి, సంతోష్, శ్రీకాంత్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed