మరో ‘సారీ’ మోడీ సభకు టీ-బీజేపీ కీలక నేతలు డుమ్మా.. త్వరలోనే పార్టీ చేంజ్..?

by Satheesh |
మరో ‘సారీ’ మోడీ సభకు టీ-బీజేపీ కీలక నేతలు డుమ్మా.. త్వరలోనే పార్టీ చేంజ్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ నిజామాబాద్ భారీ బహిరంగ సభకు పలువురు సీనియర్లు మరోసారి గైర్హాజరయ్యారు. మొన్నటికి మొన్న పాలమూరు సభకు అటెండ్ అవ్వని నేతలంతా ఈ సభకు కూడా హాజరు కాలేదు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాలమూరు సభకు హాజరై.. నిజామాబాద్ సభకు వెళ్లలేదు. ఇకపోతే మాజీ ఎంపీ వివేక్ పాలమూరు సభ సందర్భంగా శంషాబాద్ వరకు వెళ్లి ప్రధానికి స్వాగతం పలికారు. కానీ సభకు వెళ్లలేదు. ప్రధాని నిజామాబాద్‌లో ఉండగా.. వివేక్ ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. అక్కడ రాష్టప్రతి ద్రౌపది ముర్మును ఆయన కలిశారు. కాగా ఈ సభకు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి సైతం గైర్హాజరయ్యారు.

కీలక నేతలే ప్రధాని మోడీ సభకు డుమ్మా కొట్టడంపై బీజేపీలో చర్చ జరుగుతోంది. కాగా సోషల్ మీడియాలో ఈ నేతలు త్వరలో పార్టీ వీడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు విసృత ప్రచారం జరుగుతోంది. వారు హాజరుకాకపోవడం వెనుక ఉద్దేశమేంటనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ప్రియారిటీ దక్కడంలేదని పలు దఫాలుగా వీరంతా సీక్రెట్ మీటింగులు పెట్టుకున్నారు. మరి పార్టీ వీడబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంత మేరకు వాస్తవముందనేది చూడాల్సిందే.

Next Story