టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత

by Disha Web |
టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత
X

దిశ, చెన్నూర్: రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఢిల్లీ వేదికగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఇవాళ(గురువారం) హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు. నల్లాల ఓదేలుతోపాటు ఆయన భార్య, మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కుటుంబ సభ్యులతో ఆయన ఢిల్లీకి చేరారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నల్లాల ఓదెలుకు కాకుండ బాల్క సుమన్‌కు టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో అప్పటినుంచి ఆయన కొంత పార్టీకి దూరంగా ఉంటున్నారు.
Next Story