వాళ్లకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు: మాజీ మంత్రి హరీష్ రావు

by Mahesh |   ( Updated:2025-02-12 05:14:45.0  )
వాళ్లకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు: మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు (Former minister Harish Rao) ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా(Social media platform) ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునే ఉన్నారు. ముఖ్యంగా రైతులు, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంపై ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోం గార్డుల (Home Guards)కు 12 రోజులు గడుస్తున్నా జీతాలు (salaries) చెల్లించకపోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆయన ట్వీట్‌లో "చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

ఈఎంఐలు (EMI) చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) దీనికి ఏ సమాధానం చెబుతారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు పెడుతున్నారని. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన (Anti-people rule) అని మండిపడ్డారు. అలాగే హోంగార్డులకు వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు (Former minister Harish Rao) తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Next Story

Most Viewed