CBIకి అనుమతి ఇద్దామా? వద్దా? త్వరలోనే సర్కారు నిర్ణయం

by Disha Web Desk 4 |
CBIకి అనుమతి ఇద్దామా? వద్దా? త్వరలోనే సర్కారు నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోకి సీబీఐని అనుమతి ఇద్దామా? వద్దా? అనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సీబీఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కలిసివచ్చే లాభనష్టాలపై ఆరా తీస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోకి సీబీఐకి ఎంట్రీని ఎత్తేశారు. అయితే ఈ మధ్య ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవినీతిని విచారించేందుకు సీబీఐ లేదా సమాన స్థాయి విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం హెచ్ఎండీఏ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తే, రాజకీయ విమర్శలు వస్తాయని అనుమానం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.

సీబీఐ ఎంట్రీతో ప్రయోజనం శూన్యం

పదేళ్ల కాలంలో హెచ్ఎండీఏలో జరిగిన అక్రమాలను విచారించేందుకు సీఎం రేవంత్ సీరియస్‌గా ఉన్నారు. అయితే దర్యాపు బాధ్యతలను సీబీఐకి అప్పగించడంతో రాజకీయ జోక్యం మొదలవుతుందనే ఉందని ప్రచారం ఉంది. ఎందుకంటే సీబీఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, దీనితో బీజేపీ లీడర్ల ఆదేశాల మేరకు విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ లీడర్లు అందోళన చెందుతున్నారు. అందుకని సీబీఐకి జోలికి వెళ్లకుండా హెచ్ఎండీఏ అవినీతిని నిగ్గుతేల్చే బాధ్యతలను స్టేట్‌లోని విచారణ సంస్థలకు ఇవ్వాలని మెజార్టీ లీడర్లు సూచించినట్టు తెలిసింది.

మేడిగడ్డపై సీబీఐ విచారణకు డిమాండ్

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తరువాత బాధ్యులు ఎవరో తేల్చాలని డిమాండ్ తెరమీదికి వచ్చింది. విచారణ బాధ్యతలను సీబీఐకి ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. కేసును సీబీకి అప్పగిస్తే, బీఆర్ఎస్‌ను రక్షించే ప్రయత్నాలు జరుగుతాయని అనుమానంతో కాంగ్రెస్ ప్రభుత్వం వి జిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు హెచ్ఎండీఏ కేసును సీబీఐకి అప్పగించి, మేడిగ డ్డ కేసును ఇవ్వకపోతే బీజేపీ నుంచి విమర్శలు వస్తాయనే అభిప్రాయాలు పార్టీలో ఉన్నాయి.

హెచ్ఎండీఏ అవినీతిపై సీఐడీ?

హెచ్ఎండీఏ నిర్వహించిన ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అక్రమాలను బహిర్గతం చేసే బాధ్యతలను సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థల కంటే, స్టేట్‌లోని విచారణ సంస్థలే వేగంగా పనిచేస్తాయని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. దీనితో త్వరలో హెచ్ఎండీఏలో జరిగిన అవినీతిని విచారించాలని ప్రభుత్వం సీఐడీని ఆదేశించే చాన్స్ ఉన్నట్టు సమాచారం.


Next Story

Most Viewed