తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 2 |
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్‌లో చర్చించిన అంశాలను ఆర్థికశాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ ఖర్చులపై చర్చించినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీల అమలుపైనా సుదీర్ఘ చర్చ జరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలని అభిప్రాయపడ్డారు. అందుకే అన్ని అంశాలను తెలుపాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఆదాయ-వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

ముందుగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని అన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయబోతున్నట్లు తెలిపారు. అందుకోసం ఈ నెల 9వ తేదీన ఆ రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. అందులో గ్యారంటీ-1 లోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గ్యారంటీ-2: రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు అని తెలిపారు. మిగిలిన నాలుగు గ్యారంటీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అంతకుముందు తమకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు చెప్పారు.

Next Story