ఆ మూడు పార్టీలు ములాఖత్.. ఎంపీ రాహుల్ గాంధీ సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 19 |
ఆ మూడు పార్టీలు ములాఖత్.. ఎంపీ రాహుల్ గాంధీ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ములుగు సభలో మాట్లాడిన రాహుల్.. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. చాలా వరకు రాజకీయ పార్టీలు తమకు నష్టం కలిగే నిర్ణయాలు తీసుకోవని కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు విషయంలో లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా రాష్ట్ర ఏర్పాటు చేసిందన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐం ములాఖత్ అయ్యాయని.. తెలంగాణ సీఎం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిరద్శనం అన్నారు. మీరు బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. సీఎం కేసీఆర్ గతంలో అనేక హామీలు ఇచ్చారని.. దళితులకు మూడు ఎకరాలు భూమి, ఉద్యోగాలు, రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇచ్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ప్రజల ధనాన్ని కేసీఆర్ తన జేబులో వేసుకున్నారని ధ్వజమెత్తారు.

కానీ తాము అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లో ఇచ్చిన హామీలు నెరవేర్చాం. కర్నాటకలో మేము ఐదు గ్యారెంటీలు ఇచ్చామని.. మొదటి కేబినెట్‌లోనే హామీలు నెరవేర్చామన్నారు. తామిచ్చిన హామీలు నెరవేరుతున్నాయో లేదో కర్నాటక వెళ్లి చూడాలి. మేము ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకుంటాం. ఆదివాసీల భూములు, మీ హక్కులు వాపస్ ఇస్తామని నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇస్తున్నామని తప్పక నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.

Next Story