టీ-కాంగ్రెస్ పార్టీలో విషాదం.. ఎన్నికల వేళ సీనియర్ నేత కన్నుమూత

by Disha Web Desk 19 |
టీ-కాంగ్రెస్ పార్టీలో విషాదం.. ఎన్నికల వేళ సీనియర్ నేత కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ టీ-కాంగ్రెస్‌లో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు టీ. నాగయ్య కన్నుమూశారు. సోమవారం అర్థరాత్రి బెల్లంపల్లిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సీనియర్ లీడర్ నాగయ్య మృతిపట్ల టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాగయ్య అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని బాధను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి జీవితకాలం పార్టీ కోసమే కృషి చేశారని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నాగయ్య కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాగయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. హఠాన్మరణం చెందిన నాగయ్య మృతి పట్ల మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్, కోదండరెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

Next Story

Most Viewed