కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ అవసరం: మోత్కుపల్లి

by Disha Web Desk 2 |
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ అవసరం: మోత్కుపల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్‌కు బుద్ధి లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. దళితబంధులో 50 శాతం కమీషన్లు తిన్న చరిత్ర బీఆర్ఎస్ సర్కార్‌ది అని చెప్పారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ అవసరం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజకీయాలను వ్యాపారం చేశారన్నారు. వ్యాపారం కోసమే బీఆర్ఎస్ పార్టీ నడిచిందన్నారు. ప్రజలను కలవని దొంగ కేసీఆర్ అని మండిపడ్డారు. కానీ సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అద్భుతంగా కొనసాగుతుందన్నారు. ప్రగతిభవన్, ఫామ్ హౌజ్‌కే పరిమితమై ప్రజలతో సంబంధాలు తెంచుకున్నారన్నారు. దీనికి నిదర్శనమే తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని గుర్తు చేశారు. ఇప్పటికైనా మారకపోతే భవిష్యత్‌లో బీఆర్ఎస్ పార్టీ మట్టిలో కలసిపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.

Next Story