జగన్ నివాసం ఎదుట భద్రతా చర్యలు.. ఎందుకంటే..?

by Mahesh |
జగన్ నివాసం ఎదుట భద్రతా చర్యలు.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ (YCP party) ఘోర పరాజయం (terrible defeat) పాలైంది. దీంతో అధికారం కోల్పోవడంతో మాజీ సీఎం జగన్ నివాసం (Residence of former CM Jagan)వెళ్లే మార్గాల్లో ఉన్న ట్రాఫిక్ అంక్షలను(Traffic points) ఎత్తివేశారు. దీంతో వైసీపీ కేంద్ర కార్యాలయం (YCP Central Office), జగన్ నివాసం (Jagan's residence) ముందు ఉన్న రోడ్లపై నుంచి సామాన్య ప్రజలు (Common people) వెళ్లడంతో దూరం తగ్గి.. వారికి ఉపశమనం కలిగించింది. అయితే దీనిని ఆసరాగా తీసుకున్న కొంతమంది ఆకతాయిలు. వైసీపీ ఓటమి చెందిన సమయంలో, ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు.. మాజీ సీఎం జగన్ నివాసం ముందు నుంచి ర్యాలీగా వెళ్లడం, కేకలు వేయడం, వంటివి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ కేంద్ర కార్యాలయం, జగన్ నివాసం ఎదుట భద్రతా (Security in front of Jagan's residence) చర్యలు ప్రారంభించారు.

ఇందులో భాగంగా.. భారీ భద్రతా ఏర్పాట్లు (Heavy security arrangements) చేస్తున్నారు. ముఖ్యంగా.. జగన్ నివాసానికి వెళ్లే మార్గం (The way to Jagan's residence)లో పెద్ద మొత్తంలో సెక్యూరిటీ కెమెరాల(Security cameras)ను పోలీసులు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి నిత్యం ఆ మార్గంలో పోలీసులను ఉంచనున్నట్లు తెలుస్తుంది. అయితే ఓటమి తర్వాత చాలా రోజులు ప్రజలకు దూరంగా ఉన్న జగన్ (Jagan).. ఇటీవల విజయవాడలో వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమను ఎవ్వరు ఎమ్ చేయలేరని, అన్ని గుర్తు పెటుకుంటామని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి బదులిస్తామని.. కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై యువకులు, ఆకతాయిలు ఎవరైన స్పందించి జగన్ ఇంటిపై దాడులు చేసే అవకాశం ఉందనే కోణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Next Story