నిధులు రాక సర్పంచ్​లు చస్తున్నారు..సెక్రటరీకి గుడ్​గవర్నెన్స్​లేఖ..

by Disha Web |
నిధులు రాక సర్పంచ్​లు చస్తున్నారు..సెక్రటరీకి గుడ్​గవర్నెన్స్​లేఖ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సకాలంలో నిధులు రాక సర్పంచ్​లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్​ కార్యదర్శి యం పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయితీల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. పల్లే ప్రగతి పేరిట సర్పంచ్​‌లను సతాయిస్తున్నారని స్పష్టం చేశారు. నాలుగు విడతలుగా నిర్వహించిన కార్యక్రమాలకు ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదన్నారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరి కొందరైతే భిక్షాటన, కూలీ, నాలీ చేసుకుంటూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలంటూ పంచాయతీరాజ్​, రూరల్​ డెవలప్​మెంట్​ డిపార్ట్​మెంట్ ముఖ్య కార్యదర్శికి ఆయన శనివారం లేఖ రాశారు.

Next Story