హైకమాండ్‌ పిలుపుతో ఢిల్లీకి జగ్గారెడ్డి.. ఎలా వెళ్తున్నాడో తెలుసా?

by GSrikanth |
హైకమాండ్‌ పిలుపుతో ఢిల్లీకి జగ్గారెడ్డి.. ఎలా వెళ్తున్నాడో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీ ప్రయాణమయ్యారు. హై కమాండ్ నుంచి పిలుపు రావడంతో రాజధాని ఎక్సప్రెస్‌లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ ప్రత్యేక సమావేశం కానున్నారు. సార్వత్రిక ఎన్నికలు, చేరికలపై నేతలతో చర్చించనున్నారు. అదేవిధంగా చేరికల్లో అభ్యంతరాలను కూడా స్వీకరించనున్నారు. అందరి నేతలకు అభిప్రాయం మేరకు చేరికలు, టికెట్ పంపిణీపై ఓ జాబితాను కూడా తయారు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ అసంతృప్త, రెబెల్ నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఇవాళ కాంగ్రెస్ పెద్దల్ని కలవనున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 తర్వాత ఈ భేటీ జరుగనుంది. ఆ తర్వాతే పార్టీలో చేరే అంశంపై ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని ఈ ఇద్దరూ అంటున్నారు.

Next Story

Most Viewed