సంగారెడ్డి పేలుడు ఘటన.. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

by Disha Web Desk 4 |
సంగారెడ్డి పేలుడు ఘటన.. బాధిత కుటుంబాలకు  ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌‌లోని ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలి పలువురు కార్మికులు మృతి చెందిన ఘటన‌పై అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. బుధవారం ఆమె సంఘటనా స్థలాన్ని సందర్శించి అగ్ని ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియాను మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని వెంటనే అందజేస్తామని మంత్రి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హాస్పటల్‌కు తరలించామని, క్షతగాత్రులు కోలుకునేంత వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు.


Next Story

Most Viewed