BREAKING : ఆప్ పార్టీకి కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండానే వర్తిస్తుంది.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING : ఆప్ పార్టీకి కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండానే వర్తిస్తుంది.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునలయ్యాయి. కొన్ని పార్టీలో ఒంటరిగా బరిలోకి దిగుతుంటే మరికొన్ని పార్టీలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్, బీజేపీ పార్టీకి పెద్దగా ఏమీ తేడా లేదని, ఆ పార్టీ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండానే అమలు చేస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల ఢిల్లీ ఆప్ సర్కార్ ‘ప్రతి మంగళవారం ప్రభుత్వం పాఠశాలల్లో సుందర‌కాండ, హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై రియాక్ట్ అయి అసదుద్దీన్ బీజేపీ, ఆప్ మధ్య మధ్య తేడా లేదన్నాడు. పాఠశాలల్లో సుందరకాండ, హనుమాన్‌ చాలీసాను బోధించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్పించాలి గాని మతపరమైన అంశాలు బోధించడం కరెక్ట్ కాదన్నారు. బాబ్రీ మసీదు ఘటన జరగకపోతే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవేనా అని ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాలతో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపించారు.



Next Story

Most Viewed