బీజేపీ పదేళ్లలో చేసిందేంటి: సామ రామ్మోహన్ రెడ్డి

by Disha Web Desk 12 |
బీజేపీ పదేళ్లలో చేసిందేంటి: సామ రామ్మోహన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్ల పాటు పవర్ లో ఉండి తెలంగాణ కోసం బీజేపీ ప్రత్యేకంగా ఏమీ చేసిందని? కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ...రెండు సార్లు పవర్ లో ఉన్న బీజేపీ నిర్ణయాలు వలన పేద ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. దేశంలోని పేదలు ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికే వివిధ సర్వేలు వెల్లడించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇస్తే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్క కార్డును కూడా పెంచలేదన్నారు. వృద్ధులు, వితంతువులు పెన్షన్ల పరిస్థితీ అంతే అన్నారు. అవినీతిని నిర్మూలిస్తామని చెప్పిన బీజేపీ, నల్లధనాన్ని వెనకవేసుకున్నదన్నారు.

బీజేపీ ప్రజలను మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. ధరలను నియంత్రిస్తామని దొంగ మాటలు చెప్పి, నిత్యావసర, అత్యవసర వస్తువులన్నీంటికీ రేట్లు పెంచేశారన్నారు. డీజీల్, పెట్రోల్ ధరలు పేదలకు అందని మార్క్ కు చేరుకున్నాయన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని జనాలు ఫిక్స్ అయ్యారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందన్నారు. కానీ బీజేపీ ఇప్పటి వరకు మేనిఫెస్టో పెట్టకుండా డైలమాలో ఉన్నదన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ తీసుకెళ్లి పోతే, బీజేపీ నాయకులు ఒక్కరూ ఖండించ లేదన్నారు.

ఇక ఎయిమ్స్ లాంటి హాస్పిటల్‌ను మెయింటెన్ చేయడం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఎయిమ్స్ లో 750 పడకలు ఉండాలని, కానీ ప్రస్తుతం కేవలం 135 మాత్రమే ఉన్నాయన్నారు. దీని వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మోడీ మూడు నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులకు చావుకు కారణమయ్యాడన్నారు. దేశవ్యాప్తంగా 180 ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ కట్టగా, మోడీ వాటిని నిర్వీర్యం చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చలగాని దయాకర్, కోటా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed