Sajjanar: ఫేక్ మ‌నుషులను న‌మ్మితే నిండా ముంచుతారు.. వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |
Sajjanar: ఫేక్ మ‌నుషులను న‌మ్మితే నిండా ముంచుతారు.. వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నకిలీ మనుషులతో ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని గుడ్డిగా నమ్మితే నిండా మంచుతారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సమాజంలో జరిగే మోసాలు, నేరాలపై ఎల్లప్పుడూ ప్రజలకు అవగాహాన కల్పించేలా పోస్టులు పెట్టే ఆయన ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. "ఫేక్ మనసులతో జాగ్రత్త!" అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇలాంటి వాటిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మ‌న చుట్టుప‌క్కల చిరున‌వ్వుల‌తో సంచ‌రించే ఫేక్ మ‌నుషుల ప‌ట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

న‌కిలీ వ్యక్తిత్వాల‌ను గుడ్డిగా న‌మ్మితే.. నిండా ముంచుతారని తెలిపారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. ఎంత‌టి మాయ‌గాడైన మ‌నం సందు ఇస్తేనే మ‌న‌వైపున‌కు చొచ్చుకువ‌స్తాడని హితవు పలికారు. ఫేక్ మ‌నుషుల మాట‌ల‌ను బ‌ట్టి సులువుగా గుర్తించి.. ఒక ప‌రిధిలోనే వారిని ఉంచాలని చెప్పారు. అలా కాదు కూడ‌ద‌ని మ‌నం ఆస్కారం ఇచ్చామా.. ఏదో ఒక రోజు న‌ష్టం చేస్తారని ముందస్తు సూచన చేశారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ఎలాంటి ఉప‌యోగం ఉండ‌దని అవగాహన కల్పించారు.

Advertisement

Next Story

Most Viewed