బిగ్ బ్రేకింగ్.. సాగర్ ఎడమ కాలువ(వరద కాలువ)కు భారీ గండి

by Mahesh |
బిగ్ బ్రేకింగ్.. సాగర్ ఎడమ కాలువ(వరద కాలువ)కు భారీ గండి
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ కు భారీగా వరద వస్తుండటంతో అధికారులు సాగర్ గేట్లతో పాటు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం వరద ఉధృతి భారీగా పెరగడం, డ్యాం పూర్తి స్థాయిలో నిండటంతో 22 గేట్లన ఎత్తిన అధికారులు కాలువల గేట్లను కూడా మరింత పైకి ఎత్తి నీటిని తరలిస్తున్నారు. అయితే సాగర్ ఎడమ కాలువలో నీరు భారీగా ప్రవహిస్తుండటంతో.. వరద కాలువకు గండి పడింది. అనుములు మండలం మారెపల్లి వద్ద భారీ గండి పడటంతో కాలువలోని నీరు పొలాల్లోకి భారీ ఎత్తున చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారుల వెంటనే ఎడమ కాలువను మూసి వేసినట్లు తెలిపారు. అలాగే గండి పడిన ప్రదేశానికి చేరుకుని పూడిక పనులు ప్రారంభించినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed