రాష్ట్రపతికి వర్తించే నియమం గవర్నర్‌కు వర్తించదా? తమిళిసై సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
రాష్ట్రపతికి వర్తించే నియమం గవర్నర్‌కు వర్తించదా? తమిళిసై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంచలన కామెంట్లు చేశారు. దేశ అత్యున్నత పదవిలో ఉంటున్న రాష్ట్రపతి రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తి అని చెప్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి (పరోక్షంగా ప్రస్తావిస్తూ) గవర్నర్ విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాలకు చెందిన వ్యక్తులనే గవర్నర్‌గా నియమిస్తున్నారనే ప్రస్తావన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇటీవల కొత్త సచివాలయం భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని, గవర్నర్‌గా తనకు ఆహ్వానం కూడా అందలేదని గుర్తుచేశారు. రాజ్‌భవన్‌కు ఇన్విటేషన్ వెళ్ళిందా లేదా అనే అంశంపై రాష్ట్రంలో చాలా తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నది ముఖ్యమంత్రి అయినందున ఆయన చేతుల మీదుగానే సచివాలయం ఓపెనింగ్ జరిగిందని, గవర్నర్‌కు ఆహ్వానమే పంపలేదని తమిళిసై వ్యాఖ్యానించారు.

ఇప్పుడు కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలనే వార్తలు వినిపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ వైఖరిని ప్రస్తావిస్తూ ఇక్కడే తిరకాసు ఉన్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తిగా భావిస్తూ గవర్నర్ విషయంలో మాత్రం రాజకీయాలతో లింక్ ఉన్నట్లుగా భావించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

రాజ్ భవన్ VS ప్రగతిభవన్.. గ్యాప్‌తో కొలువుదీరని కమిషన్లు

తెలంగాణ కీర్తిని చాటేలా ఉత్సవాలు.. నిధులు విడుదల



Next Story

Most Viewed