తెలంగాణ మహిళలకు BIG అలర్ట్.. ఆర్టీసీ అధికారుల కీలక హెచ్చరిక

by Disha Web Desk 2 |
తెలంగాణ మహిళలకు BIG అలర్ట్.. ఆర్టీసీ అధికారుల కీలక హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు గ్యారంటీలను అమలు చేసిన విషయం తెలిసిందే. అందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచుతూ అమల్లోకి తీసుకొచ్చారు. తాజాగా.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే మహిళలకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు వంటి ఏదైనా ఐడీ కార్డు ఉంటేనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని.. లేదంటే ఛార్జీలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఐడీ కార్డు చూపిస్తేనే.. జీరో టికెట్ జారీ చేస్తామన్నారు. లేదంటే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సిందేనని.. తీసుకోకుంటే రూ. 500 ఫైన్ వేస్తామని హెచ్చరించారు. ఈ ‘మహాలక్ష్మీ’ పథకం ద్వారా రాష్ట్ర మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.

Next Story