విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

by Rajesh |
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. వరంగల్ లోని టీజీఎస్ ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్ లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ (https://iti.telangana.gov.in) లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివని.. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను సంస్థ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే తరగతులను నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్‌ సౌకర్యం కల్పిస్తున్నాం. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించగలరు. పూర్తి వివరాలను https://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లోనూ చూడొచ్చని ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed